- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి ‘పెద్ది’ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి ‘పెద్ది’ సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా చేసిన సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరిశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్లు నిన్న అర్ధరాత్రి పడిపోయాయి. ఈ క్రమంలో సినిమా బాగుందని జనాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రామ్ చరణ్ యాక్టింగ్ తో పాటు బుచ్చిబాబు దర్శకత్వం, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసినట్లు చెబుతున్నారు.
సినిమా ప్రీమియర్లు పడ్డ నేపథ్యంలో పెద్ది సినిమా OTT ఫ్లాట్ ఫామ్ ఖరారు అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది. దాదాపు రూ.150 కోట్ల వరకు పెట్టి మరి, ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. సినిమా రిలీజ్ అయిన 45 రోజుల తర్వాత ఈ మూవీని ఓటీటీలో ప్రదర్శించబోతున్నారట.






