నేడు ‘జాతీయ బాలికా దినోత్సవం’.. ఆడబిడ్డలకు శుభాకాంక్షలు చెప్పిన CM రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-24 04:32:45  IST  )

‘జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

నేడు ‘జాతీయ బాలికా దినోత్సవం’.. ఆడబిడ్డలకు శుభాకాంక్షలు చెప్పిన CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బాలికల సాధికారతతోనే ప్రగతిశీల తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తు, సమగ్ర తెలంగాణ నిర్మాణంలో బాలికల పాత్ర అత్యంత కీలకమని, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ప్రతి బాలికకు నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, పూర్తి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు. ఆడబిడ్డలు ఆత్మవిశ్వాసంతో ఎదిగి, నాయకత్వ బాధ్యతలు చేపట్టేలా తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ (Telangana Rising Vision–2047) లక్ష్యానికి అనుగుణంగా, ప్రతి బాలిక తనలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వెలికితీసి, రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో క్రియాశీలక భాగస్వామి కావాలని ఆయన కోరారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించే విషయంలో సమాజంలోని ప్రతి పౌరుడు కృషి చేయాలని, వివక్ష లేని సమాజాన్ని నిర్మించాలని సీఎం పిలుపునిచ్చారు. ఆడబిడ్డల భవిష్యత్తును బంగారుమయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Read More..

ఆడబిడ్డల భవిష్యత్తుకు అండగా ఏపీ ప్రభుత్వం

Next Story