ఆడబిడ్డల భవిష్యత్తుకు అండగా ఏపీ ప్రభుత్వం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-24 04:33:43  IST  )

నేటి బాలికలే రేపటి సాధికార మహిళలు.

ఆడబిడ్డల భవిష్యత్తుకు అండగా ఏపీ ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆడబిడ్డ చదువు ఇంటికి వెలుగు.. నేటి బాలికలే రేపటి నిర్మాతలు అని ఏపీ ప్రభుత్వం (AP Government) విశ్వసిస్తోంది. అందుకే వారి భవిష్యత్తును రూపుదిద్దేందుకు అండగా నిలుస్తోంది. రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆరోగ్యం, విద్య, భద్రతకు పెద్దపీట వేస్తోంది. బాల్యం నుంచి వివాహం అయ్యే వరకు ప్రతి అడుగులోనూ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా నిలుస్తోంది. అందుకోసం వివిధ సంక్షేమ పథకాలను ఏపీలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆయా పథకాల ద్వారా ఆడబిడ్డలు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటోంది.

తల్లికి వందనం

ఆడబిడ్డ చదువుకు సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఆడపిల్ల చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని ద్వారా పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా రూ.15వేలను జమ చేస్తుంది. తద్వారా పేద, మధ్య తరగతి బాలికలను చదువుకునేలా ప్రోత్సహిస్తోంది. ఉన్నత విద్యను అభ్యసించే వారి కోసం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తూ వారిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తోడ్పడుతోంది.

ఆరోగ్యం.. పౌష్టికాహారం

బాలికలలో రక్తహీనతను నివారించడానికి గర్భిణీలకు, 6 ఏళ్లలోపు పిల్లలకు బలవర్ధకమైన ఆహారాన్ని ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తోంది. అలాగే పుట్టిన వెంటనే తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడానికి 'తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలు నిరంతరం అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా చిన్నారులకు బేబీ కిట్స్ ను కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తోంది.

ఆడబిడ్డ నిధి

మహిళలు సొంత కాళ్లపై నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. అందుకోసం వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఆడబిడ్డ నిధి పథకం కింద 18-59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం జమ చేస్తుంది. మహిళల ఆర్థిక సాధికారత, అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అంతేకాకుండా స్త్రీశక్తి రుణాలను అందిస్తూ వ్యాపార రంగంలో ఎదిగేందుకు ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన సుకన్య సమృద్ధి యోజనాను కూడా బాలికలకు అందుబాటులో ఉంచింది.

పెళ్లి కానుక

వివాహం అంటేనే ఖర్చుతో కూడుకున్న విషయం. ఆడబిడ్డ వివాహం చేయాలంటే ఆ ఖర్చు ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. అందులోనూ పేద, మధ్య తరగతి వారికి అది కొంత ఇబ్బందికరమైన విషయంగా చెప్పవచ్చు. అటువంటి ఇబ్బందులు ఉండకూడదని, బాల్య వివాహాలను సైతం అరికట్టాలని ఏపీ ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాలను అమలు చేస్తోంది. 18 ఏళ్లు నిండిన యువతుల వివాహానికి రూ.50,000 నుండి రూ.1,00,000 వరకు ఆర్థిక సాయం అందిస్తూ పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది.

దీపం-2 పథకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం-2 (Deepam 2.0) పథకం కింద అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది నవంబర్ 1, 2024న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ప్రతి 4 నెలలకు ఒక ఉచిత సిలిండర్ అందుతుంది, సబ్సిడీ మొత్తం 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. పథకం వల్ల మహిళలకు కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపటి వద్ద వంట చేస్తూ అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి తప్పింది.

Read More..

నేడు ‘జాతీయ బాలికా దినోత్సవం’.. ఆడబిడ్డలకు శుభాకాంక్షలు చెప్పిన CM రేవంత్ రెడ్డి

Next Story