Renu Desai: నా పేరు చెప్పుకుని డబ్బులు సంపాదిస్తున్న వారికి శాపం తగులుతుంది.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-21 07:35:36  IST  )

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai)పేరు మారుమోగిపోతోంది.

Renu Desai: నా పేరు చెప్పుకుని డబ్బులు సంపాదిస్తున్న వారికి శాపం తగులుతుంది.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai)పేరు మారుమోగిపోతోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, వీధి కుక్కలను అన్యాయంగా చంపేయడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కుక్క కాటు వేస్తేనే ప్రాణం విలువ గుర్తొస్తుందా? రేప్ చేసి చంపేస్తున్న మృగాల విషయంలో మీ మగతనం ఏమైంది? యాక్సిడెంట్లు, దోమకాటు వల్ల ఎంతోమంది చనిపోతున్నారు.. మరి వాటిపై ఎందుకు స్పందించరు?" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలో ఆమెపై విపరీతమైన విమర్శలు రావడంతో, తనను కాపాడటానికి భర్త లేదా తల్లిదండ్రులు ఎవరూ లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా తనపై ట్రోల్ చేస్తున్న వారికి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

‘‘గత రెండు రోజులుగా నా పేరు వాడుకుని వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ డబ్బుకు నా శాపం తగులుతుంది.. మీరు కచ్చితంగా బాధపడతారు’’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. సొంతంగా టాలెంట్ లేని వారే ఇతరులపై స్టుపిడ్ గాసిప్స్ రాస్తూ, వెటకారంతో వీడియోలు చేస్తారని ఆమె మండిపడ్డారు. వీధిలో ముసలివాళ్లలా కూర్చుని పాడ్‌కాస్ట్‌లు చేస్తూ ఇతరులను విమర్శించడం మానుకోవాలని చెప్పింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిజినెస్ పర్సన్స్ అనేవారు లేకపోతే మీలాంటి వారు ఎలా బతుకుతారని ఆమె నిలదీసింది. మీ దగ్గర ఉన్నది కేవలం వ్యంగ్యం, నాన్సెన్స్ మాత్రమే తప్ప కంటెంట్ లేదని విమర్శించింది. ఈ పోస్ట్‌కు మరిన్ని వివాదాలు తలెత్తకుండా ఆమె కామెంట్ సెక్షన్‌ను డిసేబుల్ చేయడం గమనార్హం. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read More..

Naa Anveshana : రేణూ దేశాయ్ కి యూట్యూబర్ అన్వేష్ బంప‌ర్ ఆఫ‌ర్‌

Next Story