- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Naa Anveshana : రేణూ దేశాయ్ కి యూట్యూబర్ అన్వేష్ బంపర్ ఆఫర్
వీధి కుక్కలపై జరుగుతున్న దాడులపై రేణు దేశాయ్, యాంకర్ రష్మీ పోరాటం చేస్తున్నారు. అయితే, వాళ్ల పోరాటంపై తాజాగా యూట్యూబర్ నా అన్వేష్ తొలి సారిగా స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: వీధి కుక్కల వివాదం రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ తరుణంలోనే వీధి కుక్కలపై జరుగుతున్న దాడులపై రేణు దేశాయ్, యాంకర్ రష్మీ పోరాటం చేస్తున్నారు. అయితే, వాళ్ల పోరాటంపై తాజాగా యూట్యూబర్ నా అన్వేష్ తొలి సారిగా స్పందించారు. వీధి కుక్కల సంరక్షణ కోసం తాను కూడా పనిచేస్తానని ప్రకటించాడు. రేణు దేశాయ్ లాంటి వ్యక్తులకు తాను అండగా నిలుస్తానని వివరించారు.
అయితే వీధి కుక్కలను కాపాడడంలో ప్రభుత్వం ముందుకు రాదని స్పష్టం చేశారు. కానీ కుక్కలను ప్రేమించే వాళ్ళందరూ ఏకం కావాలని పిలుపునిచ్చాడు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా డబ్బులు సేకరించి... ఆ వీధి కుక్కలకు ఎక్కడిక్కడ షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచనలు చేశాడు అన్వేష్. కుక్కలంటే ఇష్టమున్న వాళ్ళందరూ డబ్బులు ఇవ్వాలని కోరాడు. తాను కూడా ఎంతో కొంత సహాయం చేస్తానని వివరించాడు. ఈ డబ్బుల సేకరణ కార్యక్రమాన్ని రేణు దేశాయ్ ముందుండి నడిపించాలని కోరాడు. వీధి కుక్కల నిధుల సేకరణ కోసం తాను కూడా వీడియోలు చేస్తానని ప్రకటించాడు. దీంతో అన్వేష్ చేసిన ప్రకటనపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Read More..






