- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరేళ్ల తర్వాత అసలైన పండుగ ఇది.. వాళ్లందరికీ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ నాగవంశీ ఎమోషనల్ కామెంట్స్
నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.

దిశ, సినిమా: నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో చిత్రయూనిట్ సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ (Nagavamsi)భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది కూడా పెద్ద హిట్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయి సంతృప్తి మాత్రం దక్కలేదని తెలిపారు. ‘‘సినిమా హిట్ అయినా 100 శాతం సాటిస్‌ఫ్యాక్షన్ ఉండలేదు. కానీ ఈసారి మాత్రం 2020లో విడుదలైన ‘అలవైకుంఠపురంలో’ తర్వాత నాకు అంతటి ఆనందం ఇచ్చిన సంక్రాంతి ఇదే’’ అని అన్నారు. అలాగే ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నవీన్ పొలిశెట్టి గురించి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి 1000% సాటిస్ఫై చేసినందుకు.. 2026 జర్నీ సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అవ్వటానికి నాకు పూర్తిగా సపోర్ట్, సాయం చేసిన నవీన్ పొలిశెట్టికి థాంక్యూ. ఇలాంటి సంక్రాంతిని మళ్లీ ఇచ్చిన ఆడియెన్స్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీడియా కూడా నా సినిమా సక్సెస్ కావాలని కోరుకుంది. అంతేకాదు.. నా కాంపిటీటర్ ప్రొడ్యూసర్లు కూడా అదే కోరుకున్నారు. వరుసగా రెండు సినిమాలు బోల్తా పడటంతో వాళ్లు అలా అనుకుని ఉండొచ్చు’’ అని ఎమోషనల్ అయ్యారు. ఇక సినిమా విజయానికి కృషి చేసిన ఫ్యాన్ బాయ్స్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించిన నాగవంశీ.. ‘‘గత 72 గంటలుగా మా ఫ్యాన్ బాయ్స్ ఎంతో కష్టపడ్డారు. మరిన్ని లాభాలు తీసుకురండి. వాళ్లందరికీ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను’’ అంటూ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read More..






