వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ డీల్ ఫిక్స్.. ట్వీట్ వైరల్

by I. Sairam |   (  Updated:2026-01-17 03:45:24  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47, ఎ.కె. 47’.

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ డీల్ ఫిక్స్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47, ఎ.కె. 47’. దీనిని హారిక అండ్ హాసిని పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని 2026 సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వెంకటేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీ(OTT) డీల్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్(Netflix) అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు మూవీ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘హౌస్ నెం. 47, AK 47లో గురూజీ మరియు వెంకటేష్‌తో మాస్‌ని కలుసుకున్న క్లాస్ .. ఆదర్శ కుటుంబం తెలుగు(Telugu), తమిళం(Tamilam), హిందీ(Hindi), మలయాళం(Malayalam) మరియు కన్నడ(Kannada) భాషలలో థియేటర్లలో విడుదలైన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

Read More..

ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ.. ధనుష్ రొమాంటిక్ డ్రామా ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే?

Next Story