ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ.. ధనుష్ రొమాంటిక్ డ్రామా ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-17 03:44:34  IST  )

ధనుష్(Dhanush), కృతి సనన్ (Kriti Sanon)జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishk Mein)బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ.. ధనుష్ రొమాంటిక్ డ్రామా ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
X

దిశ, సినిమా: ధనుష్(Dhanush), కృతి సనన్ (Kriti Sanon)జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishk Mein)బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఆయన దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘రాంఝనా’కి సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. ఆ అంచనాలను మించిన స్థాయిలో ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. గత ఏడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ‘తేరే ఇష్క్ మే’ తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ముఖ్యంగా ప్రేమ, విరహం, భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఆవిష్కరించాడనే అభిప్రాయాలు వినిపించాయి.

ధనుష్ నటనకు మరోసారి ప్రశంసలు వెల్లువెత్తగా.. కృతి సనన్ పాత్రకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. కమర్షియల్ విజయం సాధించడమే కాకుండా.. ఎంతోమంది ప్రేక్షకుల మనసులను కూడా గెలుచుకుంది. సంగీతం, కథనం, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. దీంతో ‘తేరే ఇష్క్ మే’ 2024లో గుర్తుండిపోయే ప్రేమకథలలో ఒకటిగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూవీ జనవరి 23న ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది.దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఆనందపడుతున్నారు.

Read More..

నెలరోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న మల్టీస్టారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Next Story