లెక్కింపు కేంద్రం నుంచి ఎవరూ వెళ్లొద్దు.. అంతిమ విజయం మనదే: మమతా బెనర్జీ

by Malleboina Mahesh |   (  Updated:2026-05-04 08:55:38  IST  )

బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓట్లను దొంగిలించిందని ఆరోపిస్తూ, తుది విజయం టీఎంసీదేనని ఆమె కార్యకర్తల్లో ధైర్యం నింపారు.

లెక్కింపు కేంద్రం నుంచి ఎవరూ వెళ్లొద్దు.. అంతిమ విజయం మనదే: మమతా బెనర్జీ
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఎంసీ (TMC)కీ షాక్ తగలగా.. ప్రతిపక్ష బీజేపీ భారీ మెజార్టీతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళిపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న టీఎంసీ నేతలు, ఏజెంట్లు ఎవరూ బయటకు వెళ్లకూడదని ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు కేవలం మూడు రౌండ్ల ఫలితాలు మాత్రమే వెలువడ్డాయని, పార్టీ ఇంకా ఓడిపోయినట్లు కాదని ఆమె కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎన్నికల సంఘం (EC) సుమారు 70 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటి వరకు వెల్లడించలేదని, దీని వెనుక ఏదో జరుగుతోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మమతా బెనర్జీ, 'SIR' (Systematic Intervention in Results) పేరుతో బీజేపీ ఓట్లను దొంగిలించిందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని, అయినప్పటికీ తుది ఫలితాలు కచ్చితంగా తమవైపే ఉంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఫలితాల ప్రకటన ముగిసే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండి ప్రక్రియను పర్యవేక్షించాలని ఆమె తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ప్రధాని ‘ఝల్ మురి’ మ్యాజిక్.. ఝార్‌గ్రామ్‌లో ఘనవిజయం దిశగా బీజేపీ

Next Story