ప్రధాని ‘ఝల్ మురి’ మ్యాజిక్.. ఝార్‌గ్రామ్‌లో ఘనవిజయం దిశగా బీజేపీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-04 08:56:48  IST  )

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రధాని ‘ఝల్ మురి’ మ్యాజిక్.. ఝార్‌గ్రామ్‌లో ఘనవిజయం దిశగా బీజేపీ
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)ను బీజేపీ చావుదెబ్బ కొట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఝార్‌గ్రామ్‌లో ఓ చిన్న దుకాణంలో ‘ఝల్ మురి’ తిన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ఎఫెక్ట్ కారణంగా ఇప్పుడు అదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి లక్ష్మి కాంత సౌ (Lakshmi Kantha Sou), టీఎంసీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే మంగల్ సరెన్‌ (Mangal Soren)పై 11 వేల ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో మధ్యాహ్నం ఒంటి గంట ముగిసేసరికి మొత్తం 294 స్థానాల్లో బీజేపీ 192 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఎంసీ కేవలం 92 స్థానాలకే పరిమితమైంది. అక్కడ మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 170కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఇక మమతా బెనర్జీ ‘బయటి వ్యక్తులు’ వర్సెస్ వర్సెస్ ‘భూమిపుత్ర’ అన్న నినాదంతో ప్రచారం చేయగా, ప్రధాని మోడీ మాత్రం ‘ఝల్ మురి’ తింటూ బెంగాలీ సంస్కృతితో మమేకమై ప్రజల మనసు గెలుచుకున్నారని పొలిటికల్ అనలిస్టులు ఫలితాలను విశ్లేషిస్తున్నారు.

దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్నికల ఫలితాలు.. ముగ్గురు ముఖ్యమంత్రులు వెనుకంజ

Next Story