ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు తేలాల్సిందే.. కేసీఆర్‌కు సిట్ నోటీసులపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-29 09:13:54  IST  )

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నంది నగర్ లోని తన నివాసంలో సిట్ అధికారులో నోటీసులు ఇచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు తేలాల్సిందే.. కేసీఆర్‌కు సిట్ నోటీసులపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నంది నగర్ లోని తన నివాసంలో సిట్ అధికారులో నోటీసులు ఇచ్చారు. మాజీ సీఎం వయస్సును దృష్టిలో ఉంచుకొని వారు కోరిన ప్రదేశంలోనే విచారిస్తామని సిట్ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం తో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ పారదర్శకంగా సాగుతోందని స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడిగా మాజీ సీఎం కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉందని, అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ట్యాపింగ్ ఉదంతంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనేది నిగ్గు తేలాల్సి ఉందన్నారు.

అధికారుల ప్రమేయం మాత్రమే కాకుండా, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ స్థాయి ఉల్లంఘనలు జరగవని ఆయన అభిప్రాయపడ్డారు. సిట్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అవసరమైతే ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉందని, కేసీఆర్‌కు నోటీసుల విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. ఇది కేవలం చట్టపరమైన ప్రక్రియ అని, బాధ్యులెవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో కీలక అధికారుల అరెస్టులు, వాంగ్మూలాలు సేకరించిన నేపథ్యంలో.. విచారణ వేగవంతమై తదుపరి నోటీసులు ఎవరికి అందబోతున్నాయనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

MORE NEWS : KCRను టచ్ చేయడం.. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే: మాజీ మంత్రి హరీశ్‌రావు హాట్ ట్వీట్

Next Story