LPG Subsidy: రూ. లక్ష కోట్ల మార్క్ దాటనున్న ఎల్‌పీజీ సబ్సిడీ భారం

by S Gopi |

ఇది కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.30,000 కోట్ల కంటే సుమారు రూ.70,000 కోట్లు ఎక్కువ.

LPG Subsidy: రూ. లక్ష కోట్ల మార్క్ దాటనున్న ఎల్‌పీజీ సబ్సిడీ భారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇంధనం, ఎల్‌పీజీ ధరల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వంపై సబ్సిడీ భారం రోజురోజుకు పెరుగుతోంది. పీఎల్ క్యాపిటల్ నివేదిక ప్రకారం, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ సబ్సిడీ వ్యయం రూ. లక్ష కోట్లను దాటే అవకాశం ఉంది. ఇది కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.30,000 కోట్ల కంటే సుమారు రూ.70,000 కోట్లు ఎక్కువ. ప్రస్తుతం ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ భారం సుమారు రూ.490గా ఉందని నివేదిక పేర్కొంది. యుద్ధ సంబంధిత అనిశ్చితి, అంతర్జాతీయ ఇంధన ధరల ఒత్తిడి కారణంగా పెరిగిన ఖర్చులో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వం, చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) భరిస్తున్నాయని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్-మేలో మొత్తం సబ్సిడీ వ్యయం రూ.75,540 కోట్లకు చేరి, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 47 శాతం పెరిగింది. ఇందులో ఆహార సబ్సిడీ రూ.40,800 కోట్లకు, యూరియా సబ్సిడీ రూ.28,450 కోట్లకు, పోషకాల ఆధారిత ఎరువుల సబ్సిడీ రూ.6,010 కోట్లకు పెరిగింది. పెరుగుతున్న సబ్సిడీ భారం కారణంగా ప్రభుత్వం ద్రవ్య లోటును నియంత్రించడంపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని, దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మూలధన వ్యయంపై కొంత నియంత్రణ ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది.

Next Story