- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD పట్టణ పేదలకు గుడ్ న్యూస్.. నగరంలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకం ప్రారంభం
హైదరాబాద్ క్యూర్ పరిధిలో పేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని పేదల సొంతింటి కలను సాకారం చేసేలా తెలంగాణ ప్రభుత్వం మరో పథకం ప్రారంభించింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలో అల్పాదాయ వర్గాల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ రాష్ట్ర సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనినివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజారుద్దీన్ కలిసి ప్రారంభించారు. ఈ పథకం కింద క్యూర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం టవర్ల రూపంలో ఇండ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టబోతోంది. ఒక్కో టవర్ లో 10 ఫ్లోర్లు, అంతస్తుకు 12 ప్లాట్లు నిర్మించేలా ప్రణాళి సిద్ధం చేసింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరిలో లక్ష ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ భూముల్లో ఈ టవర్లను హౌసింగ్ బోర్డు నిర్మించనుంది. ఇందుకోసం చార్మినార్, బహదూర్ పురా, ముషీరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించింది. గరిష్ఠ వార్షికాదాయం రూ. 6 లక్షలు, ఇల్లు, స్థలం లేకపోవడం ఈ పథకానికి ప్రధాన అర్హతలుగా ప్రభుత్వం పేర్కొంది. తొలివిడతలో నియోజకవర్గానికి 500 ప్లా్ట్ల చొప్పున నిర్మించాలని నిర్ణయించారు.
ఎక్కడ నివసిస్తే అక్కడే ఇల్లు:
ఈ పథకం ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పేదవాడి చిరు కోరిక సొంత ఇల్లు అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే సొంత ఇల్లు సాకారం అవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా స్థలం ఉన్న వారికి 4.50 లక్షల ఇండ్లు ఇచ్చామని ఆగస్టు నాటికి 2 లక్షల పైగా ఇండ్లు పూర్తి కాబోతున్నాయని అన్నారు. క్యూర్ పరిధిలో లక్ష ఇండ్ల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నామని గజం రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఉన్న ప్రాంతంలో కూడా ఇండ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కోర్ పరిధిలో 30 కి.మీ దూరంగో ఇండ్లు ఇచ్చింది. ఆ అనాలోచిత నిర్ణయం వల్ల కట్టిన ఇండ్లు కూడా ఇవ్వలేకపోయారని, ఉపాధికి దూరంగా ఉండటంతో పేదలకు ఇచ్చిన ఇళ్లలో నివసించడానికి ఇష్టపడట్లేదన్నారు. కానీ మేము క్యూర్ పరిధిలోని పేదలు వారు నివసించే ప్రాంతంలోనే ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. చివరి లబ్ధిదారు వరకు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.






