- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడిమల్కాపూర్‌లో ఘనంగా బీజేపీ బహిరంగ సభ.. పార్టీలో చేరిన బండారి వెంకటేష్
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

దిశ, కార్వాన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కార్వాన్ నియోజకవర్గం గుడిమల్కాపూర్ డివిజన్‌కు చెందిన బండారి వెంకటేష్ ఆదివారం తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక మోహిని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ నేత ఎన్. రామచంద్రరావు, తెలంగాణ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉమా మహేందర్, సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, కార్వాన్ ఇన్‌ఛార్జ్ అమర్ సింగ్, బండారి శ్రీనివాస్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బండారి వెంకటేష్‌కు బీజేపీ అగ్రనాయకులు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
పేదల సంక్షేమమే మోదీ ధ్యేయం
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో మేటిగా నిలబెడుతున్నారని కొనియాడారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. బీజేపీ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అందుకే దేశంలోని 22 రాష్ట్రాలలో ఎన్డీయే ప్రభుత్వం దిగ్విజయంగా నడుస్తోందని వారు గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీని విజయతీరాలకు చేర్చాలని పిలుపునిచ్చారు. అంతకుముందు, గుడిమల్కాపూర్ చౌరస్తాలో నూతన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని నాయకులు ప్రారంభించారు. అనంతరం చౌరస్తా నుండి మోహిని ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బద్దం మహిపాల్ రెడ్డి, దేవర వంశీ, బండారి ప్రకాష్, అనంత కృష్ణ, డీజిల్ సింగ్, రాములు, శివరత్నం, కృష్ణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






