- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఇటీవల ‘హరి హరి వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఇటీవల ‘హరి హరి వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustad Bhagat Singh) ఒకటి. హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పవర్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. ఇందులో తమిళ నటుడు పార్తిబన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి పోస్టర్లు తప్ప మరే అప్డేట్ రాలేదు. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
ఇక విడుదల విషయంలోనూ మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘ఉస్తా్ద్ భగత్‌సింగ్’ థియేటర్స్‌లోకి ఎప్పుడొస్తుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు విడుదలకు రెండు తేదీలను చిత్రబృందం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి మార్చి 27, రెండోది ఏప్రిల్ 23 అని టాక్. మార్చిలో రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల కాబోతుండటం వల్ల బాబాయ్ అబ్బాయి మధ్య పోటీ వద్దనుకుని ఏప్రిల్ 23న ఉస్తాద్‌ను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. అప్పడైనా విడుదల చేస్తారో లేదో అని ఆందోళన చెందుతున్నారు.






