క్లైమాక్స్ సీక్వెన్స్ కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్-నీల్ మూవీ.. పోస్ట్ వైరల్

by I. Sairam |   (  Updated:2026-01-21 05:42:55  IST  )

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు.

క్లైమాక్స్ సీక్వెన్స్ కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్-నీల్ మూవీ.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మిస్తున్నది. అయితే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం చాలా సన్నగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు కర్ణాటకలోనూ విదేశాల్లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం భాగ్యనగరంలో చిత్రీకరణ జరుగుతుంది. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ క్లైమాక్స్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయిందట. చివరి బ్లాక్ కోసం ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ అబ్సొల్యూట్ బీస్ట్ మోడ్‌లోకి వెళ్లడంతో ఈ మూవీపై మరింత హైప్ పెరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Read More..

చరణ్ ఫ్రెండ్‌షిప్ కోసం తారక్ పెద్దిని త్యాగం చేశాడా..? చర్చనీయాంశంగా మారిన పోస్ట్

Next Story