చరణ్ ఫ్రెండ్‌షిప్ కోసం తారక్ పెద్దిని త్యాగం చేశాడా..? చర్చనీయాంశంగా మారిన పోస్ట్

by I. Sairam |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'(Peddi).

చరణ్ ఫ్రెండ్‌షిప్ కోసం తారక్ పెద్దిని త్యాగం చేశాడా..? చర్చనీయాంశంగా మారిన పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'(Peddi). బుచ్చిబాబు సానా(Buchi babu Sana) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో స్టార్ క్యాస్టింగ్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా 'పెద్ది' సినిమా 2026 మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. పెద్ది సినిమా కథ ఫస్ట్ బుచ్చిబాబు ఎన్టీఆర్‌(NTR)కి వినిపించాడట. అయితే ఎన్టీఆర్ చరణ్ సూట్ అవుతాడని పంపించాడట. అలా ఇతను చాలా ఇండస్ట్రీ హిట్లను వదులుకున్నారట. అందులో ఆర్య, కృష్ణ, కిక్, శ్రీమంతుడు, దిల్, ఊపిరి ఈ సినిమాలన్నీ డేట్స్ ఖాళీగా లేక తారక్ వదిలేసుకున్నాడట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story