- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న ‘ది రాజాసాబ్’ మూవీ.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్, కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’(The Rajasaab).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్, కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’(The Rajasaab). మారుతి(Maruthi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో ప్రభాస్ సరసన ముగ్గురు హాట్ బ్యూటీలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. సంజయ్ దత్, యోగిబాబు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 9న థియేటర్స్‌లోకి వచ్చి ఆశించినంత స్థాయిలో ఆడలేకపోయింది. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా విమర్శలను ఎదుర్కొంది. ఇటు ప్రేక్షకులను మెప్పించకపోవడమే కాక.. కలెక్షన్ల పరంగా కూడా పెద్దగా రాబట్టుకోలేకపోవడంతో నిర్మాతలకు నష్టాలు వచ్చినట్లు టాక్.
తాజాగా, ‘ది రాజాసాబ్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ డీల్ ఖరారైనట్లు తెలుస్తోంది.జీయో హాట్‌స్టార్ ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ. 80 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇది అన్ని భాషలకు సంబంధించిన డీల్ కావడం విశేషం. సినిమా డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ ఈ స్థాయిలో ఓటీటీ డీల్ కావడం బెటర్ అని చెప్పొచ్చు. అయితే ‘ది రాజాసాబ్’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 15న శివరాత్రి కానుకగా.. స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.






