- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మారుతికి చుక్కలు చూపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఇంటికి 100కు పైగా COD ఫుడ్ ఆర్డర్లు
మారుతి ఇంటికి ఏకంగా 100కు పైగా క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్డర్లు పెట్టారు. మారుతి కొండాపూర్ కొల్ల లగ్జరీ విల్లాలో నివాసం ఉంటుండగా అభిమానులు ఆయన నివాసానికి ఆర్డర్స్ పెడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: డైరెక్టర్ మారుతికి ప్రభాస్ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించినమేర విజయం సాధించకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరో పిలిచి అవకాశం ఇస్తే ఫ్లాప్ సినిమా ఇచ్చాడని మండిపడుతున్నారు. మారుతి మోసం చేశాడని సోషల్ మీడియాలో ఆయనపై నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా తాజాగా మారుతి ఇంటికి ఏకంగా 100కు పైగా క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్డర్లు పెట్టారు. మారుతి కొండాపూర్ కొల్ల లగ్జరీ విల్లాలో నివాసం ఉంటుండగా అభిమానులు ఆయన నివాసానికి ఆర్డర్స్ పెడుతున్నారు.
స్విగ్గీ, జొమాటా నుండి వరుసగా ఆర్డర్లు రావడంతో సెక్యురిటీ సిబ్బంది షాక్ అయ్యారు. విషయం మారుతికి చెప్పడంతో తాను ఎలాంటి ఆర్డర్స్ పెట్టలేదని వచ్చివారిని వెనక్కి పంపించాలని చెప్పారు. దీంతో ఫుడ్ ఆర్డర్ల వ్యవహారం సెక్యురిటీ సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే అభిమానుల తీరు దర్శకులను భయాందోళనకు గురి చేస్తోంది. కేవలం మారుతి విషయంలోనే కాకుండా పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్లకు గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో స్టార్ హీరోలతో సినిమా అంటేనే దర్శకులు వణుకుతున్నారు.






