సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌పై మెగా బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-22 06:04:45  IST  )

హంగామా, ధూమ్, గోల్‌మాల్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రిమీ సేన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌పై మెగా బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: హంగామా, ధూమ్, గోల్‌మాల్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రిమీ సేన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. చిరంజీవి(Chiranjeevi) సరసన ‘అందరివాడు’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ, ప్రస్తుతం దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఇంటర్వ్యూలో పాల్గొన్న రిమీ సేన్(Rimi Sen), సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే వాస్తవ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా ఇండస్ట్రీ పూర్తిగా మగవారి ఆధిపత్యంలో ఉంటుందని, ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలానికే పరిమితమవుతుందని ఆమె అభిప్రాయపడింది.

గత 30 ఏళ్లుగా సల్మాన్ ఖాన్(Salman Khan), షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)లాంటి హీరోలు అదే స్థాయిలో కొనసాగుతుండగా, ఒకప్పుడు వాళ్ల సరసన హీరోయిన్లుగా నటించిన వారు ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలు లేదా హీరోల తల్లులుగా కనిపిస్తున్నారని ఆమె పేర్కొంది. ఈ వాస్తవాన్ని ముందుగానే అర్థం చేసుకున్న తాను, సినిమాలపై పూర్తిగా ఆధారపడకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. తాను నిర్మించిన ‘బుధియా సింగ్’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చినప్పటికీ, గ్లామర్ ప్రపంచం కన్నా వ్యాపార రంగంలోనే తనకు నిజమైన ఆర్థిక భద్రత లభించిందని రిమీ సేన్ స్పష్టం చేసింది. కెమెరా ముందు ఉండాల్సిన ఒత్తిడి లేకుండా ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నానని చెప్పింది. హీరోయిన్ల కెరీర్, భవిష్యత్తుపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Read More..

నేను పెళ్లి చేసుకోకపోవడానికి అజయ్ దేవగన్ కారణం.. అసలు విషయం బయటపెట్టి షాకిచ్చిన టబు

Next Story