- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరికొద్ది సేపట్లో టీజీ పాలిసెట్ ఫలితాలు
టీజీ పాలిసెట్ ఫలితాలు నేడు ఉదయం 11:30 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థుల ఫలితాలు నేరుగా వారి వాట్సాప్ నంబర్లకే పీడీఎఫ్ రూపంలో వస్తాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG Polyset) ఫలితాలు నేడు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ఎస్బీ టెట్ కార్యాలయంలో విడుదల కానున్నాయి. ఈసారి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అత్యంత సులభంగా ఫలితాలను చేరవేసేందుకు తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్ డీ) విభాగం సరికొత్త డిజిటల్ విధానాన్ని తీసుకువచ్చింది. ప్రముఖ డిజిటల్ సేవా వేదిక మీ సేవ వాట్సాప్, చాట్‌బాట్ ద్వారా ఫలితాలను నేరుగా అభ్యర్థుల మొబైల్ ఫోన్లకే పంపించనున్నారు. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నాయకత్వంలో పౌర సేవలను మరింత పారదర్శకంగా, సులభంగా అందించేలా మీ సేవ ఈ వినూత్న సేవను విస్తరించింది. గత ఏడాది నవంబర్ 18న ప్రారంభమైన మీ సేవ వాట్సాప్ సేవలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం గా మారాయి.
ఫలితాలు పొందే విధానం..
టీజీ పాలిసెట్ ఫలితాలు అధికారిక మీ సేవ వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా నేరుగా అభ్యర్థులకు అందుతాయి. ఇది పూర్తిగా అవుట్‌బౌండ్ సేవ. అంటే అభ్యర్థులు ఫలితాల కోసం ప్రత్యేకంగా ఎలాంటి మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు. పరీక్ష రాసి, రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల మొబైల్ నంబర్లకు ఫలితాలు విడుదలైన వెంటనే మార్కుల వివరాలు పీడీఎఫ్ రూపంలో ఆటోమేటిక్‌గా వస్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ వాట్సాప్‌కు వచ్చిన ఆ పిడిఎఫ్‌ను తక్షణమే చూసుకోవడంతో పాటు, భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోవచ్చు. ఈ సరికొత్త సాంకేతికత ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు టెన్షన్ లేకుండా, సర్వర్ సమస్యలు రాకుండా పరీక్ష ఫలితాలు వేగంగా, సురక్షితంగా అందుతాయని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.






