- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదల
టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 82.94% ఉత్తీర్ణత నమోదు కాగా, వరంగల్‌కు చెందిన నామాల లోకేశ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG Polyset) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ఎస్బీ టెట్ కార్యాలయంలో విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల 13న జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 98,029 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 86.38 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 72.92 ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో వరంగల్ కు చెందిన నామాల లోకేశ్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. సూర్యాపేటకు చెందిన బానోతు హేమనాథ్ సెకండ్ ర్యాంక్ సాధించారు.
ఈసారి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అత్యంత సులభంగా ఫలితాలను చేరవేసేందుకు తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్ డీ) విభాగం సరికొత్త డిజిటల్ విధానాన్ని తీసుకువచ్చింది. ప్రముఖ డిజిటల్ సేవా వేదిక మీ సేవ వాట్సాప్, చాట్‌బాట్ ద్వారా ఫలితాలను నేరుగా అభ్యర్థుల మొబైల్ ఫోన్లకే పంపుతున్నారు. గత ఏడాది నవంబర్ 18న ప్రారంభమైన మీ సేవ వాట్సాప్ సేవలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం గా మారాయి.
ఫలితాలు పొందే విధానం..
టీజీ పాలిసెట్ ఫలితాలు అధికారిక మీ సేవ వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా నేరుగా అభ్యర్థులకు అందుతాయి. ఇది పూర్తిగా అవుట్‌బౌండ్ సేవ. అంటే అభ్యర్థులు ఫలితాల కోసం ప్రత్యేకంగా ఎలాంటి మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు. పరీక్ష రాసి, రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల మొబైల్ నంబర్లకు ఫలితాలు విడుదలైన వెంటనే మార్కుల వివరాలు పీడీఎఫ్ రూపంలో ఆటోమేటిక్‌గా వస్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ వాట్సాప్‌కు వచ్చిన ఆ పిడిఎఫ్‌ను తక్షణమే చూసుకోవడంతో పాటు, భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోవచ్చు. ఈ సరికొత్త సాంకేతికత ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు టెన్షన్ లేకుండా, సర్వర్ సమస్యలు రాకుండా పరీక్ష ఫలితాలు వేగంగా, సురక్షితంగా అందుతాయని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.






