పాతబస్తీలో ఉద్రిక్తత.. భద్రతా దళాలపై రాళ్లు రువ్విన నిరసనకారులు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-07 04:35:21  IST  )

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నగరంలోని పాతబస్తీలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.

పాతబస్తీలో ఉద్రిక్తత.. భద్రతా దళాలపై రాళ్లు రువ్విన నిరసనకారులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నగరంలోని పాతబస్తీలో అక్రమ నిర్మాణాలను(Demolition of illegal structures) అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. అధికారులపై దాడికి సైతం యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశాయి. ఒకానొక దశలో భద్రతా బలగాలపై కూడా నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అంతకంతకూ దిగజారుతోంది. గాలిలో ప్రమాణాలకు మించి ప్రమాదకరమైన విషవాయువులు వ్యాపిస్తున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. గొంతు మంట, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Read More..

ఆందోళనకారులపై దూసుకెళ్లిన బస్సు.. పది మంది మృతి

Next Story