- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆందోళనకారులపై దూసుకెళ్లిన బస్సు.. పది మంది మృతి
ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం(Jerusalem)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం జెరూసలేంలో సైనిక నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేశారు. వేలాది మంది హాజరైన ప్రదర్శనలో పురుషుల గుంపుపైకి ఓ బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో దాదాపు పదిమంది యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, రెండు సంవత్సరాల సుదీర్ఘ యుద్ధం తర్వాత సైన్యం మానవశక్తి కొరతను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే పౌరులను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చిన నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అనుకోని ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More..
పాతబస్తీలో ఉద్రిక్తత.. భద్రతా దళాలపై రాళ్లు రువ్విన నిరసనకారులు






