విజయ్ వర్మతో బ్రేకప్‌‌పై తమన్నా సెన్సేషనల్ కామెంట్స్.. షాక్‌లో నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-27 12:15:52  IST  )

గ్లామర్ ప్రపంచంలోకి వచ్చి 20 ఏళ్లు దాటుతున్నా.. దశాబ్దాలు మారుతున్నా, కొత్త హీరోయిన్లు వస్తున్నా తమన్నా(Tamannaah Bhatia) క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

విజయ్ వర్మతో బ్రేకప్‌‌పై తమన్నా సెన్సేషనల్ కామెంట్స్.. షాక్‌లో నెటిజన్లు
X

దిశ, సినిమా: గ్లామర్ ప్రపంచంలోకి వచ్చి 20 ఏళ్లు దాటుతున్నా.. దశాబ్దాలు మారుతున్నా, కొత్త హీరోయిన్లు వస్తున్నా తమన్నా(Tamannaah Bhatia) క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఈ భామ, పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో రిలేషన్ షిప్ ప్రకటించినప్పటి నుండి నెట్టింట వీరి పెళ్లి ఎప్పుడన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈక్రమంలోనే ఈ జోడీ విడిపోయారనే ప్రచారం జరుగుతున్న సమయంలో తమన్నా తన గత ప్రేమల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన జీవితంలో రెండు సార్లు తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లు వెల్లడించింది. టీనేజ్ వయసులోనే మొదటిసారి ప్రేమలో పడ్డానని, కానీ ఆ బంధం కోసం తన లక్ష్యాలను, కెరీర్‌ను వదులుకోవడం ఇష్టం లేక బ్రేకప్ చెప్పుకున్నానని నిర్మొహమాటంగా చెప్పేసింది.

మనిషిగా ఎదగాలని, జీవితంలో ఎంతో సాధించాలనే పట్టుదల ముందు ఆ ప్రేమ నిలవలేకపోయిందని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. మొదటి బ్రేకప్ తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడిన తమన్నాకు అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైందట. ఇదే విషయాన్ని చెబుతూ తమన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది.‘‘అతడు నాకు సరైన వ్యక్తి కాదని ఆలస్యంగా తెలిసింది.. అలాంటి వారితో బంధాన్ని కొనసాగించడం ప్రమాదకరం’’ అని ఆమె పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం విజయ్ వర్మతో బ్రేకప్ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తమన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పలు అనుమానాలకు దారితీస్తోంది. అసలు తమన్నా మనసులో ఏముంది? డేంజర్ అన్నది విజయ్ వర్మనేనా అని అంతా అయోమయంలో పడిపోయారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

READ MORE ....

కోలీవుడ్ స్టార్ హీరోకు జోడీగా శృతి హాసన్.. పోస్ట్ వైరల్

Next Story