కోలీవుడ్ స్టార్ హీరోకు జోడీగా శృతి హాసన్.. పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-27 12:16:58  IST  )

వైవిధ్యభరితమైన పాత్రలతో మెప్పించే చియాన్ విక్రమ్(Chiyaan Vikram) తన క63వ ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీ అయిపోయారు.

కోలీవుడ్ స్టార్ హీరోకు జోడీగా శృతి హాసన్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: వైవిధ్యభరితమైన పాత్రలతో మెప్పించే చియాన్ విక్రమ్(Chiyaan Vikram) తన క63వ ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ బోడి కె. రాజ్‌కుమార్ (Bodi K. Rajkumar) డైరెక్ట్ చేస్తున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులను ముగించుకుని షూటింగ్ దశకు చేరుకుంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఓ అప్డేట్‌ విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ సరసన శృతి హాసన్‌(Shruti Haasan) హీరోయిన్‌గా ఎంపికైనట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

విక్రమ్ కెరీర్‌లో 63వ చిత్రంగా తెరకెక్కుతున్న అనౌన్స్‌మెంట్ తోనే అటు విక్రమ్ ఫ్యాన్స్‌లో, ఇటు శృతి హాసన్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది.​గతంలో వీరిద్దరి కాంబోలో కొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్తాయని వార్తలు వచ్చినప్పటికీ, వివిధ కారణాల వల్ల అవి క్యాన్సిల్ అయ్యాయి. చివరకు విక్రమ్ 63వ సినిమాతో ఈ 'మోస్ట్ అవేటెడ్' జోడీ వెండితెరపై మెరవబోతోంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ మార్క్ యాక్షన్ తో పాటు, శృతి హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ కానున్నాయని సమాచారం. తాజా సమాచారం ప్రకారం, శరవేగంగా చిత్రీకరణ జరిపి ఈ సినిమాను ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

READ MORE ....

విజయ్ వర్మతో బ్రేకప్‌‌పై తమన్నా సెన్సేషనల్ కామెంట్స్.. షాక్‌లో నెటిజన్లు

Next Story