- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్.. క్రికెట్ అభిమానుల కోసం వెస్ట్రన్ రైల్వే స్పెషల్ ట్రైన్స్
అహ్మదాబాద్‌లో భారత్ vs కివీస్ T20 వరల్డ్ కప్ ఫైనల్ సందడి! అభిమానుల కోసం ముంబై నుండి ప్రత్యేక రైళ్లు. విమాన ప్రయాణ భారానికి రైల్వే చెక్.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) చివరి అంకానికి చేరుకుంది. ఈ రోజు సాయంత్రం ఫైనల్ మ్యాచ్ (Final match) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. మాములుగానే భారతదేశంలో క్రికెట్ మ్యాచుకు వేలాది మంది ప్రేక్షకులు వస్తుంటారు. అలాంటిది టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ కావడం.. ఫైనల్ లో భారత్ ఆడనుండటం తో అహ్మదాబాద్ నగరం (Ahmedabad city) ఇప్పటికే భారత అభిమానులతో సందడిగా మారింది. ఈ నెల 5న జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై గెలిచి భారత్ ఫైనల్ చేరిన వెంటనే క్రికెట్ అభిమానులు ఫైనల్ చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసుకున్నారు.
మరికొద్ది గంటల్లో నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో భారత్ - న్యూజిలాండ్ మధ్య జరగనున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరుతో అహ్మదాబాద్ నగరం క్రికెట్ జాతరను తలపిస్తోంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ను వీక్షించేందుకు తరలివస్తున్న అభిమానుల కోసం వెస్ట్రన్ రైల్వే (Western Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నుండి అహ్మదాబాద్‌కు విమాన ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. (ఒక్కో వైపు రూ. 15,000–17,000) ఉండటంతో వేగంగా మైదానానికి చేరుకోవడానికి క్రికెట్ అభిమానులు (Cricket fans) ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సామాన్యులకు ఊరటనిస్తూ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటిచింది.






