రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు తీపికబురు.. రూ.10 కోట్ల నిధులు మంజూరు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-08 10:55:30  IST  )

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి మరో విడత నిధుల విడుదలకు శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు తీపికబురు.. రూ.10 కోట్ల నిధులు మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి మరో విడత నిధుల విడుదలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 138 మున్సిపాలిటీలకు పలు దఫాలుగా నిధులు మంజూరు చేసిన సర్కార్, తాజాగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ (SFC) ద్వారా నిధులు రూ.10 కోట్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సీఎం రేవంత్ సర్కార్ నిధుల విడుదలను వేగవంతం చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన నిధులను మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడానికి, అత్యవసర మరమ్మతులు, మురుగునీటి కాలవల శుభ్రత, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల మరమ్మతులకు ఉపయోగించడానికి మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వాటా నిధులను ప్రభుత్వం నేరుగా మున్సిపాలిటీలకు మళ్లిస్తోందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Read More... TG: మున్సి‘పోల్స్‌’‌కు వడివడిగా అడుగులు.. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఈసీ భేటీ

Next Story