- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: మున్సి‘పోల్స్’కు వడివడిగా అడుగులు.. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఈసీ భేటీ
తెలంగాణ (Telangana)లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక అడుగులు వేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని (Rani Kumudini) ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2019 నాటి ఓటరు జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ‘నోటా’ (NOTA)ను సమర్థవంతంగా అమలు చేయడంపై పార్టీల అభిప్రాయాలను కోరారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణపై అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో పలు రాజకీయ పార్టీలతో సమావేశాలు ముగిశాయి. ప్రస్తుతం మున్సిపాలిటీ స్థాయిలో అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. జనవరి 10 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కాగా, మరోవైపు రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి జనవరి 20 వరకు అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మార్చిలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది.






