CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు

by Prasad Jukanti |   (  Updated:2026-01-08 10:50:17  IST  )

ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే నా దగ్గరికి రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ సత్తా ఏమిటో చూపారని ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ పూర్తి స్థాయి మెజార్టీ సాధించి అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‍ను బొంద పెట్టి గుండు సున్నకు తీసుకువెళ్లాం. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‍‍ను ఓడించాం. గ్రామపంచాయతీల్లో మనం పూర్తి స్థాయిలో పట్టు సాధించామన్నారు. రాష్ట్రంలో రాబోయే మరో 8 ఏళ్లు మనమే అధికారంలో ఉండబోతున్నామని అందువల్ల స్థానిక సంస్థలలో మన పట్టు ఉంటేనే గల్లీలను అభివృద్ధి చేయగలమన్నారు. ఇవాళ గాంధీ భవన్‍లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పీసీసీ, పీఏసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం పాల్గొన్నారు. పురపాలక ఎన్నికలు, పీబీ జీరామ్ జీ పథకం, తాజా రాజకీయాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం బీఆర్ఎస్, బీజేపీ సభలలో చర్చకు రావడం లేదు. ప్రజా సమస్యల కోసం ఈ రెండేళ్లలో బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా నా వద్దకు వచ్చి నిధులు అడగలేదు. వాళ్లకు రాజకీయ పదవులు కావాలే తప్ప ప్రజా సమస్యలపై పట్టింపు లేదని విమర్శించారు.

అప్పటి వరకు మోడీని వదిలేది లేదు:

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉపాధి హామీతో ఎన్నో విప్లవాత్మక మార్పులొచ్చాయని కానీ అధికారం ఉందని మోడీ సర్కార్ ఇష్టారీతిన వ్యవహరిస్తోందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుదామని బీజేపీ ప్రణాళికలు చేసింది. కానీ ఆశించినన్ని స్థానాలు రాకపోవడంతో రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు. దీంతో వేరే రూపంలో ప్రజల హక్కులను కాలరాసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ దేశంలో ఇళ్లు, ఆస్తి లేని వారికి ఓటు హక్కు ఒక్కటే ఆయుధం అని ఈ హక్కును తొలగాలనే ఎస్ఐఆర్ తీసుకువచ్చారన్నారు. ఓటు హక్కు తీసేస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. చివరకు ఈ దేశంలో ఉండాలా లేదా అనే నిర్ణయం బీజేపీ చేతిలోకి వెళ్తుందన్నారు. ఈ దేశంలో వెట్టిచాకిరిని తిరిగి తీసుకువచ్చేందుకు బీజేపీ ఎస్ఐఆర్ ద్వారా ప్రయత్నిస్తోందన్నారు. అదానీ, అంబానీలకు తక్కువ ధరకు కూలీలు దొరకడం లేదని ఉపాధి పథకాన్ని మారుస్తున్నారు. ఇది కార్పొరేట్ కంపెనీల కుట్ర అని దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. వ్యవసాయాన్ని నీరుగార్చడం కోసం గతంలో నల్లచట్టాలు తీసుకు వస్తే నల్లచట్టాలు ఉపసంహరించుకునేలా చేయడమే కాకుండా జాతికి మోడీ క్షమాపణలు చెప్పేలా కాంగ్రెస్ చేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఉపాధి హామీ పథకం విషయంలో జాతికి క్షమాపణ చెప్పే వరకు మోడీని వదిలేదే లేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారి అమలైన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి తీసుకు వచ్చే వరకు మోడీని వదిలేది లేదన్నారు.

జనవరి 20 నుంచి గ్రామ సభల్లో తీర్మానాలు చేయాలి:

పీబీ జీరామ్ జీ చట్టం విషయంలో ఏఐసీసీ నుంచి సంపూర్ణ కార్యాచరణతో ముందుకు వెళ్తామని సీఎం చెప్పారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని ఇక రాష్ట్రంలోని 12,702 గ్రామాల్లో జనవరి 20 నుంచి 30వ తేదీ లోపు గ్రామసభలు నిర్వహించి ఈ చట్టాన్ని తిరస్కరించాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ తీర్మానం చేయడం గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్‍ల బాధ్యత మాత్రమే కాదని ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అన్నారు. అందువల్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‍లు మినహా మిగతా 15 పార్లమెట్ సెగ్మెంట్లకు మంత్రులను ఇన్ చార్జులుగా పార్టీ పరంగా నియమించాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్‍ను కోరారు. అలాగే జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఒక్కొక్కరు ఒక మండలం బాధ్యతలు తీసుకోవాలని ముఖ్యమంత్రిగా తాను కూడా ఒక మండలం బాధ్యతను తీసుకుంటానన్నారు.

జిల్లాల్లో బహిరంగ సభలు:

హైదరాద్ మినహా రాష్ట్రంలోని మిగతా 9 ఉమ్మడి జిల్లాల్లో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో పీబీ జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈ సభను ప్రారంభించాలన్నారు. ఈ సభల్లో తాను పాల్గొంటానన్నారు. నరేంద్ర మోడీ దుర్మార్గమైన ఆలోచన, పేద ప్రజలు, రైతు కూలీలను కట్టుబానిసలుగా చేసే ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ ఈ సభలు నిర్వహించాలన్నారు. ఈ తొమ్మిది సభలకు ఒక్కో జిల్లాల్లో ఒక్కో మంత్రికి బాధ్యతలు ఇవ్వాలన్నారు. ఈ సభల సమన్వ బాధ్యతలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ కార్యక్రమాలన్నింటి పర్యవేక్షణ బాధ్యతలు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఈ రాష్ట్రంలో చూస్తున్న శాఖకు మంత్రి సీతక్క. సీతక్క నియోజకవర్గంలో పెద్ద బహిరంగ సభను నిర్వహించి ఈ కార్యక్రమానికి ఆరోగ్యం సహకరిస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానిస్తామన్నారు. గ్రామ పంచాయతీలు చేసే ఈ తీర్మానాలను ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజే మోడీ తెచ్చిన ఈ చట్టానికి నిరసనగా కార్యాచరRead More... TG: మున్సి‘పోల్స్‌’‌కు వడివడిగా అడుగులు.. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఈసీ భేటీ

Read More... TG: మున్సి‘పోల్స్‌’‌కు వడివడిగా అడుగులు.. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఈసీ భేటీ

Next Story