- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్య ఊపు మామూలుగా లేదు.. లైనప్ చూస్తే మైండ్ బ్లాక్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya)కు ఇటీవలి కాలం అంతగా కలిసి రావడం లేదు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya)కు ఇటీవలి కాలం అంతగా కలిసి రావడం లేదు. ఎంత శ్రమించినా ఆ శ్రమకు తగిన ఫలితం మాత్రం దక్కడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఇటీవల విడుదలైన ‘రెట్రో’, ‘కంగువా’ సినిమాలు భారీ డిజాస్టర్లుగా మారిన విషయం తెలిసిందే. అయినా సరే, నిరాశకు లోనుకాకుండా సూర్య మాత్రం ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల లైనప్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే. తాజాగా సూర్య నటించబోయే రాబోయే చిత్రాల జాబితా సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కరుప్పు’(Karuppu) చిత్రంలో సూర్య నటిస్తున్నాడు.
షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడినట్లు సమాచారం. దీని తర్వాత సూర్య తన 46వ ప్రాజెక్ట్‌ను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేయనున్నాడు. అలాగే 47వ సినిమాను జితూ మాధవన్ తెరకెక్కించనుండగా, 48వ చిత్రాన్ని పాండిరాజ్ దర్శకత్వంలో పూర్తి చేయనున్నాడు. ఇక 49వ ప్రాజెక్ట్‌కు పా రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా, సూర్య కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 50వ చిత్రాన్ని జాగారం స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. మొత్తానికి, సూర్య లైనప్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారి అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. సూర్య ఊపు మామూలుగా లేదుగా అని కామెంట్లు చేస్తున్నారు.
Read More..






