- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
election freebies: ఎన్నికల ఉచితాల పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆ పిటిషన్ పై విచారణకు మొగ్గు
దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా.. ఆయా పార్టీలో ఓటర్లకు ఉచిత పథకాల హామీల వర్షాన్ని కురిపిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా.. ఆయా పార్టీలో ఓటర్లకు ఉచిత పథకాల హామీల (free schemes Guarantees) వర్షాన్ని కురిపిస్తున్నారు. స్థానిక, జాతీయ పార్టీలు అని తేడా లేకుండా అన్ని పార్టీలో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేసుకొని ఉచిత హామీలు ఇస్తుండటం పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. శాసనసభ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు (Political parties) ప్రకటించే 'ఉచితాల' (Freebies) పంపిణీ వ్యవహారం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని భారత సుప్రీంకోర్టు అభివర్ణించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ (Advocate Ashwini Upadhyay) ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు నగదు పంపిణీ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ₹500 నగదు, మద్యం పంపిణీ చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, నేరుగా ₹5,000 నగదు ఇస్తామని వాగ్దానం చేయడం సరికాదని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు.
అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ వాదనపై స్పందించిన సి.జె.ఐ జస్టిస్ సూర్యకాంత్ (CJI Justice Suryakant), ప్రస్తుతం కోర్టులో రోజువారీగా అనేక ఇతర ముఖ్యమైన కేసులు ఉన్నందున తక్షణమే విచారణ (Immediate inquiry) చేపట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. అయితే, ఈ అంశంలో ప్రజా ప్రయోజనం (public interest) దాగి ఉందని కోర్టు అంగీకరించింది. ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ విషయంపై మరోసారి కోర్టుకు గుర్తు చేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ.. ఆ సమయంపై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. త్వరలో దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కోర్టు నిర్ణయం కీలకంగా మారింది.






