- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్ రజినీ
సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్వీయ జీవిత చరిత్ర రాస్తున్నట్టు ఆయన కుమార్తె సౌందర్య వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్వీయ జీవిత చరిత్ర రాస్తున్నట్టు ఆయన కుమార్తె సౌందర్య వెల్లడించారు. రజినీకాంత్ ఆటోబయోగ్రఫీ బుక్ విడుదలయ్యాక వరల్డ్ సెన్సేషన్ అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ బుక్ ను తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తీసుకురాబోతున్నట్టు సమాచారం. ఈ పుస్తకంలో ఆయన బాల్యం నుంచి మొదలుకుని బస్ కండక్టర్‌గా చేసిన ఉద్యోగం, సినిమాల్లోకి రావడం, తొలి చిత్రాలు, సూపర్‌స్టార్‌గా ఎదగడానికి ఎదురైన కష్టాలు, పోరాటాలు అన్నీ ఉంటాయని సమాచారం. అలాగే ఆయన కుటుంబ జీవితం, భార్య లతా గారు, పిల్లల గురించి, రాజకీయాల్లోకి రావాలని అనుకున్న సందర్భాలు, ఆధ్యాత్మిక జీవితం, గురువులు, రామకృష్ణ మఠం ప్రభావం వంటి విషయాలూ ఇందులో ఉండనున్నాయి.
ఈ పుస్తకాన్ని రజనీకాంత్ స్వయంగా రాస్తుండగా, కొంత భాగం ఇంగ్లీష్ రచయిత సహాయంతో సిద్ధం అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం రచన దశలో ఉన్న ఈ ఆటోబయోగ్రఫీ 2026 చివర్లో లేదా 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా. కాగా సూపర్ స్టార్ ఆటోబయోగ్రఫీ కోసం ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






