- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కినేని బ్రదర్స్ మల్టీస్టారర్.. మరో మనం అవుతుందా?
అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన సినిమా ‘మనం’. మూడు తరాలు కనిపించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

X
దిశ, సినిమా : అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన సినిమా ‘మనం’. మూడు తరాలు కనిపించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు నాగ చైతన్య, అఖిల్ కాంబినేషనల్‌లో మరో మూవీ రాబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. బిగ్ ప్రొడక్షన్ హౌజ్ పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని.. కచ్చితంగా బొమ్మ సూపర్ హిట్ అవుతుందని చెప్తున్నారు. ఇక ఈ న్యూస్ విన్న అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మూవీలో నాగార్జున కూడా నటిస్తే బాగుంటుందని కోరుతున్నారు. ఇక ఈ ప్రొడక్షన్ హౌజ్ అన్నపూర్ణ స్టూడియోస్ అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. కనీసం ఈ చిత్రంతోనైనా అఖిల్ ఖాతాలో హిట్ పడితే బాగుంటుందని అంటున్నారు.
MORE NEWS : ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్ రజినీ
Next Story






