ఉత్కంఠ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్

by Malleboina Mahesh |   (  Updated:2026-05-22 13:46:30  IST  )

ఉప్పల్ వేదికగా ఆర్‌సీబీతో జరుగుతున్న ఉత్కంఠ మ్యాచులో సన్‌రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాప్-2 స్థానమే లక్ష్యమని కమిన్స్ తెలిపాడు.

ఉత్కంఠ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా ఈ రోజు 67వ మ్యాచ్ సన్ రైజర్స్, ఆర్సీబీ జట్ల మధ్య జరుగుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఉత్కంఠ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మరికొద్ది సేపట్లో సన్ రైజర్స్ బ్యాటర్లు బ్యాటింగ్ చేయనున్నారు. టాస్ గెలిచిన అనంతరం పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. టాప్ 2 చేరడమే తమ లక్ష్యం అని, అందుకు చాలా పెద్ద గేమ్ ఆడేందుకు ప్లాన్ చేశామని, మా బ్యాటర్ల మనుసులో కూడా ఇదే ఉందని ఈ సందర్భంగా పాట్ కమ్మిన్స్ చెప్పుకొచ్చాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(w), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్

ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్ రౌండర్ విజయ్ శంకర్

Next Story