- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్ రౌండర్ విజయ్ శంకర్
విదేశీ లీగ్స్ ఆడేందుకు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు విజయ్ శంకర్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ (Vijay Shankar) ఐపీఎల్ తో పాటు దేశవాళీ (Domestic) క్రికెట్‌కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ లీగ్‌లలో ఆడి తన క్రీడా జీవితాన్ని మరింత కాలం కొనసాగించేందుకు (Overseas Career) ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2026 వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేయకపోవడంతో (Unsold) విజయ్ శంకర్ తన భవిష్యత్తు ప్రణాళికను మార్చుకున్నారు. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడిన ఆయన ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో సీఎస్కే ఈ సీజన్‌కు ముందు అతడిని విడుదల చేసింది.
ఈ సందర్భంగా విజయ్ శంకర్ (Vijay Shankar) సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన భావోద్వేగ ప్రకటనను విడుదల చేశారు. "నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి క్రికెట్ నా జీవితంగా మారింది. 25 ఏళ్ల నా సుదీర్ఘ ప్రయాణంలో అన్ని స్థాయిలలో, దేశం తరఫున అత్యున్నత స్థాయిలో ఆడే అవకాశం రావడం నా అదృష్టం. కొత్త అవకాశాలను వెతుక్కుంటూ, విదేశాల్లో మరిన్ని మ్యాచ్‌లు ఆడటం కోసమే నేను ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాను" అని పేర్కొన్నారు. తన కెరీర్‌లో భారత్ ఆడిన 500వ వన్డే (నాగ్‌పూర్) లో చివరి ఓవర్ వేయడం, అలాగే 2019 ప్రపంచకప్‌లో వేసిన మొదటి బంతికే వికెట్ తీయడం ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలన్నారు. తనపై వచ్చిన విమర్శలు, నెగిటివిటీని పక్కనబెట్టి కష్టపడటాన్ని క్రికెట్ తనకు నేర్పిందని.. ఇన్నాళ్లూ సహకరించిన బీసీసీఐ, జీటీ, ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్కే, డీసీ ఫ్రాంచైజీలకు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ శంకర్ టీమిండియా తరఫున 12 వన్డేలు, 9 టీ20లు ఆడారు.






