ఎంబీఏ విద్యార్థినిని హత్య చేసి, మృతదేహంపై పైశాచికం.. క్షుద్రపూజలు చేసిన సహచర విద్యార్థి!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-17 04:49:12  IST  )

ఇండోర్‌లో కిరాతకం. ఎంబీఏ విద్యార్థిని హత్య, మృతదేహంపై పైశాచికం! నిందితుడైన క్లాస్‌మేట్ అరెస్ట్, క్షుద్రపూజల కలకలంగా మారాయి.

ఎంబీఏ విద్యార్థినిని హత్య చేసి, మృతదేహంపై పైశాచికం.. క్షుద్రపూజలు చేసిన సహచర విద్యార్థి!
X

దిశ, వెబ్ డెస్క్: సహచర విద్యార్థిని దారుణంగా హత్య చేయడమే కాకుండా మృతదేహంపై పైశాచికానికి పాల్పడ్డారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థినిని తోటి విద్యార్థి హత్య చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. ఈ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన క్లాస్‌మేట్ అయిన యువతిని దారుణంగా హత్య చేసిన నిందితుడు, ఆ తర్వాత ఆమె మృతదేహంపై పైశాచికంగా ప్రవర్తించాడని (abuse) పోలీసులు వెల్లడించారు.

హత్య అనంతరం మృతదేహంతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సమయంలో నిందితుడు క్షుద్రపూజలు కూడా చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని మానసిక స్థితిని, నేరం చేసిన తీరును పరిశీలిస్తున్నారు. కేవలం హత్య చేయడమే కాకుండా, శవంపై అఘాయిత్యానికి పాల్పడటం, మంత్రవిద్యలు, క్షుద్ర పూజల (Witchcraft) వంటి చర్యలకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

దారుణం.. మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య.. అత్యాచారంపై అనుమానాలు

Next Story