- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ అసెంబ్లీలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ అసెంబ్లీలో వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

దిశ, వెబ్ డెస్క్: 77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా స్పీకర్ ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో శాసనమండలి సభ్యులు (MLCs), వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాసనసభ సిబ్బంది, మార్షల్స్ పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ గీతాన్ని ఆలపించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు.
READ MORE .....






