- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విరిగిన జెండా కర్ర.. మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం
గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ మంత్రి వాకిటి శ్రీహరికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari)కి త్రుటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట్ జిల్లా మక్తల్ (Makthal) తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, అధికారుల సమక్షంలో మంత్రి జెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన జెండాను ఎగురవేయడానికి తాడును లాగుతున్న తరుణంలో, ఆ బరువుకు జెండా కర్ర మధ్యలోకి విరిగి కిందకు పడిపోయింది. అయిత, విరిగిపడిన కర్ర మంత్రి వాకిటి శ్రీహరికి అత్యంత సమీపంలో పడింది. ఆయన అప్రమత్తంగా పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే, ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
READ MORE .....






