- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌరభ్ గంగూలీ సెక్యూరిటీ తగ్గింపు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ భద్రతను తగ్గించింది పశ్చిమ బెంగాల్ కొత్త ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ భద్రతను తగ్గించింది పశ్చిమ బెంగాల్ కొత్త ప్రభుత్వం. దాదాకు ఇప్పటివరకు ఉన్న 'Z' కేటగిరీ భద్రతను 'Y' కేటగిరీకి తగ్గిస్తూ రాష్ట్ర హోంశాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బెంగాల్‌లో ఇటీవల కొలువుదీరిన సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం, తన మొదటి క్యాబినెట్ సమావేశాల అనంతరం తీసుకున్న ముఖ్యమైన పరిపాలనా నిర్ణయాలలో ఇది ఒకటిగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రముఖులకు ఉన్న ముప్పు తీవ్రతను అంచనా వేసేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ నిర్వహించిన సాధారణ భద్రతా సమీక్ష ఆధారంగానే గంగూలీ సెక్యూరిటీని తగ్గించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఉన్న 'Z' కేటగిరీ రక్షణ కింద గంగూలీకి పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బందితో పాటు హై-లెవెల్ రక్షణ లభించేది.
అయితే, ఇకపై అమల్లోకి రానున్న 'Y' కేటగిరీ పరిధిలో తక్కువ సంఖ్యలో పోలీసు రక్షణ సిబ్బంది మాత్రమే ఆయన భద్రతా విధుల్లో ఉంటారు. గత మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో (2023లో) సౌరభ్ గంగూలీకి ఉన్న భద్రతను 'Y' కేటగిరీ నుండి 'Z' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాన్ని Y కేటగిరీకి మార్చడం గమనార్హం. ఈ నిర్ణయం పూర్తిగా భద్రతా విశ్లేషణల ప్రకారమే జరిగిందని అధికారులు చెబుతున్నప్పటికీ, బెంగాల్ రాజకీయ మరియు క్రీడా వర్గాల్లో ఈ భద్రత తగ్గింపు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.






