అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-28 07:53:17  IST  )

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గొంది హర్షవర్ధన్ రెడ్డి(45) అమెరికాలోని ఫ్లోరిడాలో గుండెపోటుతో మృతి చెందాడు.

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
X

దిశ, వీపనగండ్ల: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గొంది హర్షవర్ధన్ రెడ్డి(45) అమెరికాలోని ఫ్లోరిడాలో గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామ సర్పంచ్ అయినా గొంది సుదర్శన్ రెడ్డి కుమారుడు ఉద్యోగ నిమిత్తం అమెరికాలో ఉంటూ తన నివాసంలో వర్క్‌ ఫ్రం హోం చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. ఆయన పదేళ్లుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. హర్షవర్ధన్‌ రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుని తల్లి గతంలో గ్రామ సర్పంచ్‌గా పని చేయగా, గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తండ్రి సుదర్శన్‌రెడ్డి బొల్లారం గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. హర్షవర్ధన్ రెడ్డి మృతితో కుటుంబంతో పాటు బొల్లారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

READ MORE ....

ఘోరం.. పెళ్లికి అంగీకరించలేదని అత్యంత కిరాతకంగా ప్రియురాలి హత్య

Next Story