ఘోరం.. పెళ్లికి అంగీకరించలేదని అత్యంత కిరాతకంగా ప్రియురాలి హత్య

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-28 07:55:01  IST  )

ప్రేమించిన యువతి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఘోరానికి పాల్పడ్డాడు. ఆఫీసుకు పిలిచి మరీ అత్యంత కిరాతకంగా చంపేశాడు.

ఘోరం.. పెళ్లికి అంగీకరించలేదని అత్యంత కిరాతకంగా ప్రియురాలి హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించిన యువతి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఘోరానికి పాల్పడ్డాడు. ఆఫీసుకు పిలిచి మరీ అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాలో ఓ ప్రైవేట్ కంపెనీలో వినయ్ సింగ్ (30) అకౌంటెంట్ గా, మింకీ శర్మ (32) హెచ్ఆర్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు. రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వినయ్ పెళ్లి ప్రపోజల్ తీసుకురాగా.. అందుకు మింకీ నిరాకరించింది. దీంతో ఆమె మరొకరితో మాట్లాడుతూ.. సన్నిహితంగా ఉంటుందేమోనని వినయ్ కు అనుమానం కలిగింది. దీంతో ఈనెల 23న ఆమెను ఆఫీసుకు పిలిచి గొడవపడి కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆపై ఆమె తలను నరికి, మృతదేహాన్ని ముక్కలు చేశాడు. తలను ఒక బ్యాగులో, మొండెం, కాళ్లను గోనె సంచిలో కుక్కి యమునా నదిలే పడేసేందుకు మింకీ స్కూటీపై జవహర్ బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. గోనెసంచి బరువుగా ఉండటంతో దానిని వదిలేసి, తలను దగ్గరలో ఉన్న కాలువలో విసిరేసి పరారయ్యాడు. మింకీ మిస్సింగ్ పై ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో 100కుపైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. వినయ్ ఆమెను హతమార్చినట్లు నిర్ధారించారు. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా.. ఆమె పెళ్లికి ఒప్పుకోనందుకే చంపేసినట్లు పోలీసులకు తెలిపాడు. హత్యకు వాడిన కత్తి, స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మింకా తల కోసం గాలిస్తున్నారు. నిందితుడిపై హత్య, సాక్ష్యాల ధ్వంసం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

READ MORE ....

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

Next Story