70 ఏళ్ల ప్రాయంలో సోషల్‌ మీడియా ఎంట్రీ.. చేసిన తొలి వ్లాగ్‌కే 3 కోట్ల వ్యూస్‌

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-22 06:16:07  IST  )

ఏజ్ అనేది ఓ నెంబర్ మాత్రమేనని 70 ఏళ్ల వృద్ధుడు నిరూపించాడు.

70 ఏళ్ల ప్రాయంలో సోషల్‌ మీడియా ఎంట్రీ.. చేసిన తొలి వ్లాగ్‌కే 3 కోట్ల వ్యూస్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఏజ్ అనేది ఓ నెంబర్ మాత్రమేనని 70 ఏళ్ల వృద్ధుడు నిరూపించాడు. సోషల్ మీడియా (Social Media)లోకి జీవిత కాలం ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా మొదటిసారి చేసిన ‘వ్లాగ్’ (Vlog) ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్ కుమార్ శర్మ (Vinod Kumar Sharma) ఇన్‌స్టాగ్రామ్‌లో తన మొదటి వ్లాగ్‌ను పోస్ట్ చేసిన కేవలం 72 గంటల్లోనే అది 2.9 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఆ వీడియోలో తనకు నాకు వ్లాగ్ చేయడం రాదని, కానీ రిటైర్మెంట్ తర్వాత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నాడు. మీరు నన్ను ప్రోత్సహిస్తే మరిన్ని వీడియోలు చేస్తానని ఆయన తన వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే, ఆయన అమాయకత్వం, నిజాయితీ నెటిజన్ల మనసు గెలుచుకుంది. వినోద్ కుమార్ శర్మ చేసిన వీడియోకు 20 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. మరోవైపు ‘వయసుతో సంబంధం లేదు అంకుల్, మీరు అద్భుతం’ అంటూ వేల సంఖ్యలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్ (Anupan Kher), జై భానుశాలి (Jai Bhaushali) వంటి వారు కూడా వినోద్ ప్రయత్నాన్ని అభినందించారు. ఆయన తదుపరి వీడియో కోసం ఎదురుచూస్తున్నామని జై భానుశాలి కామెంట్ చేశారు. అత్యంత ఖరీదైన సెట్టింగ్స్, ఎడిటింగ్ ఉండే ఈ కాలంలో కేవలం మనిషిలోని నిజాయితీ ఉంటే చాలు ప్రజల మనసు గెలవచ్చని వినోద్ కుమార్ నిరూపించారు. ప్రస్తుతం ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 64 వేలు దాటిపోవడం విశేషం.

Read More..

Video: డబ్బుల కోసం ప్రయాణికుడిపై ట్రాన్స్‌జెండర్ దాడి!

Next Story