Video: డబ్బుల కోసం ప్రయాణికుడిపై ట్రాన్స్‌జెండర్ దాడి!

by velandi.Saikiran |

ఓ ప్రయాణికుడి వద్దకు వచ్చి డబ్బులు అడిగి, రచ్చ రచ్చ చేసింది ట్రాన్స్ జెండర్. సదరు ప్రయాణికుడు డబ్బులు ఇవ్వకపోవడంతో, అతనిపై దాడి కూడా చేసింది.

Video: డబ్బుల కోసం ప్రయాణికుడిపై ట్రాన్స్‌జెండర్ దాడి!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రైళ్లలో ట్రాన్స్ జెండర్ల హడావిడి అంతా కాదు. డబ్బులు కావాలంటూ తెగ హింసిస్తుంటారు. అలాంటి సంఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉంటాం. రైళ్లలో ప్రయాణించిన వాళ్లకు ఈ సంఘటన గురించి బాగా తెలిసి ఉంటుంది. మ‌గాళ్ల‌ను టార్గెట్ చేసి, డ‌బ్బులు వ‌సూలు చేస్తూంటారు. ఇచ్చినంత తీసుకోకుండా, అడిగినంత ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా, డబ్బుల కోసం ఓ ప్రయాణికుడి పై ట్రాన్స్ జెండర్ దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

డబ్బుల కోసం ప్రయాణికుడిపై ట్రాన్స్‌జెండర్ దాడి!

బీహార్ వెళ్లే ట్రైన్ జనరల్ కోచ్ లలో విపరీతంగా ప్రయాణికులు కనిపిస్తారు. నిలబడడానికి కూడా ఛాన్స్ ఉండదు. అంతలా రష్ ఉంటుంది. ఈ సందడిలో కూడా ట్రాన్స్ జెండర్లు రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. ఓ ప్రయాణికుడి వద్దకు వచ్చి డబ్బులు అడిగి, రచ్చ రచ్చ చేసింది ట్రాన్స్ జెండర్. సదరు ప్రయాణికుడు డబ్బులు ఇవ్వకపోవడంతో, అతనిపై దాడి కూడా చేసింది. కూర్చున్న వ్యక్తిని దారుణంగా కొట్టింది.

ఈ సంఘటన నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజెన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి ట్రాన్స్ జెండర్ల‌పై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆర్పీఎఫ్‌ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. ప్రయాణికులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.




Next Story