- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల హై అలర్ట్!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రశ్నించేందుకు సిట్ (SIT) అధికారులు సిద్ధమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఈ విచారణ జరగనుంది. తన నివాస గోడకు నోటీసులు అతికించడం పై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, బాధ్యతాయుతమైన పౌరుడిగా విచారణకు సహకరిస్తానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని 'రాజకీయ కక్షసాధింపు'గా బీఆర్‌ఎస్ నేతలు అభివర్ణిస్తున్నారు. దీనికి నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించాలని, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో నందినగర్‌లోని కేసీఆర్ నివాసం వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంది.
పోలీసుల ముందస్తు చర్యలు
బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వడంతో.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఏడీజీ (ADGP) హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్పీలు (SPs), సీపీలు (CPs) అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని నందినగర్ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Read More..






