- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR సిట్ విచారణ వేళ.. తెలంగాణ భవన్‌లో 2500 మందికి భోజనాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేడు నందినగర్ నివాసంలో సిట్ విచారణకు హాజరు కాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) నేడు నందినగర్ నివాసంలో సిట్ విచారణకు హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 9:30 గంటల సమయంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి 11.30 వరకు బంజారాహిల్స్‌లోని నందినగర్ ఇంటికి కేసీఆర్ చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు సిట్ విచారణ జరుగనుంది. విచారణ సమయంలో హరీష్ రావు, కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా తెలంగాణ భవన్‌లో ఉండనున్నారు.
మరోవైపు కేసీఆర్ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి భారీగా జన సమీకరణ చేయనుంది. ఈ నేపథ్యంలో దాదాపు 2500 మందికి తెలంగాణ భవన్‌లో భోజనాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామం, మండలం పట్టణం జిల్లా కేంద్రాల్లో నిరసనలు ర్యాలీలు, ధర్నాలు రాస్తారోకోలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని సూచించారు. బీఆర్ఎస్ నిరసన నేపథ్యంలో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Read More..






