- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు సిట్ విచారణకు హాజరుకానున్న KCR.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు విచారణకు హాజరవుతారు.

దిశ, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు విచారణకు హాజరవుతారు. నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే ప్రత్యేక విచారణ బృందం.. గులాబీ బాస్ ను ప్రశ్నించనుంది. ముందుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారణ చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అయితే అధికారులు మాత్రం అస్సలు వినలేదు. దీంతో కేసీఆర్ ఒక మెట్టు దిగివచ్చారు. ఈ తరుణంలోనే నంది నగర్ లోని ఆయన నివాసంలోనే విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ విచారణ ఉండే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీ నేతలు శాంతియుతంగా నిరసనలు తెలుపనున్నారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
నంది నగర్‌లో SIT దర్యాప్తు ఉన్న తరుణంలో ఆ పరిసర ప్రాంతాలలో ఉదయం 11 గంటల నుంచి అవసరమైన మేరకు ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. నందినగర్ బస్ స్టాప్, నందినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం, జెసి రెడ్డి చికెన్ సెంటర్, యూనియన్ బ్యాంక్ బై-లేన్, బసవతారకం రోటరీ,అగ్రసేన్ జంక్షన్, టీఎస్ స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్, ఎంఆర్సీ కమాన్, రోడ్ నెం.12, సాగర్ సొసైటీ ‘టి’ జంక్షన్ వెళ్లే దారులను మళ్లీంచనున్నారు.
Read More..






