- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత స్టార్ షట్లర్ PV సింధు అరుదైన ఘనత
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అరుదైన ఘనత సాధించారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(Shuttler PV Sindhu) అరుదైన ఘనత సాధించారు. ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ(Indonesia Masters Badminton Tournament) ప్రిక్వార్టర్ ఫైనల్‌లో సింధు విజయం సాధించారు. డెన్మార్క్ షట్లర్ ఫో లినే జేర్‌ఫీల్డ్‌ను సింధు ఓడించారు. ఈ విజయంతో సింధు అరుదైన రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 500 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన తొలి భారతీయ షట్లర్‌గా సింధు నిలిచారు. బ్యాడ్మింటన్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో ఇప్పటి వరకు ఈ రికార్డును ఐదుగురు మాత్రమే అందుకున్నారు. ఇప్పుడు ఆరో ప్లేయర్‌గా సింధు నిలిచారు. భారత్ తరఫున ఈ ఘనత నెలకొల్పింది సింధునే కావడం విశేషం. కాగా, ఇండోనేషియా మాస్టర్స్‌లో తాజాగా జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో లైన్ హోజ్‌మార్క్‌ను ఎదుర్కొన్న సింధు 21-19, 21-18 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. దీంతో ఆమె క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. దీంతో సింధుకు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు వెల్లువెత్తాయి.
READ MORE ....






