విమాన ప్రయాణికులకు షాక్.. ఎయిర్ ఇండియా చార్జీల పెంపు

by Malleboina Mahesh |   (  Updated:2026-04-07 10:40:52  IST  )

విమాన ప్రయాణికులకు భారీ షాక్! ఎయిర్ ఇండియా ఇంధన సర్‌ఛార్జీల పెంపు. ఏప్రిల్ 8 నుంచి దేశీయంగా ₹899, అంతర్జాతీయంగా ₹23వేల వరకు అదనపు భారం.

విమాన ప్రయాణికులకు షాక్.. ఎయిర్ ఇండియా చార్జీల పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమాసియా (Middle East) లో నెలకొన్న యుద్ధ మేఘాలు విమాన ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో విమాన ఇంధన (ATF) ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో, టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తమ ఇంధన సర్‌ఛార్జీలను (Fuel Surcharge) భారీగా సవరించాయి. గ్లోబల్ మార్కెట్‌లో జెట్ ఫ్యూయల్ ధర కేవలం ఒక నెలలోనే బ్యారెల్‌కు $99.40 నుండి $195.19 కి (సుమారు 100% వృద్ధి) పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఎయిర్ ఇండియా గ్రూప్ వెల్లడించింది. ఈ పెరిగిన చార్జీలు దేశీయంగా ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9:01 గంటల నుంచి, కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో ఏప్రిల్ 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.

దేశీయంగా కిలోమీటర్ల లెక్కన భారం..

ఇప్పటివరకు దేశీయ విమాన టికెట్లపై ఉన్న ఫ్లాట్ సర్‌ఛార్జీకి బదులుగా, ఇకపై ప్రయాణించే దూరాన్ని బట్టి అదనపు భారం పడనుంది. 500 కి.మీ లోపు ప్రయాణానికి ₹299, అదే 2,000 కి.మీ దాటితే గరిష్ఠంగా ₹899 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా చూస్తే.. సార్క్ దేశాలకు వెళ్లే వారికి $24 (సుమారు ₹2,000), పశ్చిమాసియాకు $50 (సుమారు ₹4,200), ఆగ్నేయాసియాకు $100 (సుమారు ₹8,300) వరకు చార్జీలు పెరిగాయి. లాంగ్ హాల్ రూట్లయిన యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రయాణికులకు గరిష్ఠంగా $280 (సుమారు ₹23,300) వరకు ఇంధన సర్‌ఛార్జీ భారం పడనుంది. వేసవి సెలవుల సమయంలో ప్రయాణాలను ప్లాన్ చేసుకునే వారికి ఈ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బ గా మారింది.

Air India: ఎయిరిండియాకు షాక్.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా!

Next Story