- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెమ్యునరేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న శర్వానంద్..
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand)ఏడాది తర్వాత ‘నారి ‘నారి నడుమ మురారి’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand)ఏడాది తర్వాత ‘నారి ‘నారి నడుమ మురారి’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
ఈ వేడుకలో శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేయడమే కాకుండా, ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టిన నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నిన్ననే బాలయ్య బాబుతో మాట్లాడాను, ‘నా పరువు నిలబెట్టావు’ అని ఆయన మెచ్చుకున్నారు. ఇకపై నా ప్రతి సినిమాకు ఆయనే ముహూర్తం పెట్టాలని కోరుకుంటున్నాను’’ అని శర్వానంద్ ఎమోషనల్ అయ్యారు. సీనియర్ హీరోల ఆశీస్సులు తన విజయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara)పై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ శర్వానంద్ సంచలన ప్రకటన చేశారు. అనిల్ సుంకర మళ్లీ వరుసగా పెద్ద సినిమాలు చేసే వరకు, తన తదుపరి చిత్రానికి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోనని శర్వా ప్రామిస్ చేశారు. ఒక హీరో ప్రోడ్యూసర్ కలిసి ఉంటే ఏమవుతుందో మేము చూపిస్తామని అన్నాడు. అలాగే, ఈ సినిమాలో చిన్న కామియో రోల్ చేసిన హీరో శ్రీవిష్ణు గొప్ప మనసును కొనియాడారు. భవిష్యత్తులో అనిల్ సుంకర బ్యానర్‌లో శ్రీవిష్ణుతో కలిసి పూర్తిస్థాయి మల్టీస్టారర్ సినిమా చేస్తానని, ఇద్దరం కలిసి వెండితెరపై సందడి చేస్తామని శర్వానంద్ ధీమా వ్యక్తం చేశారు.
Read More..






